For Money

Business News

నిఫ్టిపై ఫలితాల దెబ్బ

కార్పొరేట్‌ కంపెనీల ఫలితాలు నిఫ్టిని దెబ్బతీశాయి. హెచ్‌యూఎల్‌ పనితీరు విశ్లేషకుల అంచనాలను మించినా… ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడంతో ఆ కంపెనీ షేర్‌ 4 శాతం దాకా నష్టపోయింది. ఇతర షేర్లు ఎఫ్‌ఎంసీజీ షేర్లపై ఐకూడా ఒత్తిడి పెరిగింది. ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, నెస్లే కంపెనీల షేర్లు రెండు శాతంపైగా క్షీణించాయి. నిఫ్టి ఉదయం 18,145ని తాకినా 18027 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్లు నష్టపోయింది. ఇవాళ నిఫ్టి 18000 దిగువకు పడిపోకుండా కేవలం బ్యాంకు షేర్లు కాపాడాయి. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి మాత్రమే 0.42 శాతం లాభంతో ముగిసింది. నిఫ్టిలో 36 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ దాదాపు ఒక శాతం దాకా నష్టపోయింది. ఎల్‌టీటీఎస్‌ 5 శాతం నష్టపోగా, టీవీఎస్‌ మోటార్స్‌ కూడా 4 శాతం పైగా నష్టపోయింది.