రిలయన్స్ దూకుడు
సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 1.2 లక్షల కోట్లపై రూ. 13,680 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 11.5 శాతం పెరిగింది. అదే ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 48 శాతం పెరిగింది. అన్ని విభాగాల కన్సాలిడేటెడ్ ఆదాయం రూ. 1.74 లక్షల కోట్లకు చేరింది. ఇందులోఆయిల్ టు కెమికల్ విభాగం నుంచి రూ. 1.20లక్షల కోట్ల ఆదాయం రాగా, రిలయన్స్ రీటైల్ నుంచి రూ. 45,426 కోట్ల ఆదాయం వచ్చింది. జియో ప్లాట్‌ఫామ్ నుంచి రూ.19,777 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం నుంచి వచ్చిన ఆదాయం రూ. 1,644 కోట్లని పేర్కొంది. ఇక మీడియా వ్యాపారం నుంచిరూ. 1,640 టర్నోవర్ వచ్చింది. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్ సర్వేలో పాల్గొన్న నిపుణుల అంచనా ప్రకారం ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 1.58 లక్షల కోట్ల ఆదాయంపై రూర. 12,946 కోట్ల నికర ఆదాయం వస్తుందని భావించారు.