నిరాశపర్చిన హెరిటేజ్ ఫుడ్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన 42 శాతం తగ్గింది. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.19.04 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.32.76 కోట్ల నికర లాభం ప్రకటించింది. కంపెనీ టర్నోవర్ రూ.673.19 కోట్ల నుంచి రూ.819.05 కోట్లకు పెరిగినా పాల ధరల సేకరణ, ముడి పదార్థాల ధరలు, లంపీ స్కిన్ వ్యాధి తదితర అంశాలు కంపెనీ త్రైమాసిక ఫలితాలపై ప్రభావం చూపాయని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మణి నారా తెలిపారు.