పీవీఆర్‌ను దెబ్బతీసిన ఫ్లాప్ సినిమాలు
బాలీవుడ్ పీవీఆర్ కంపెనీని దారుణంగా దెబ్బతీసింది. జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో రూ. 53.4 కోట్ల నికర లాభం ప్రకటించిన పీవీఆర్ కంపెనీ సెప్టెంబర్ నెలతో ముగిసిన మూడు నెలల్లో రూ. 71.23 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఈ త్రైమాసికంలో బ్రహ్మాస్త్ర తప్ప మరో హిట్ సినిమా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. బ్రహ్మాస్త్ర కూడా హిట్ సినిమానే కాని… పీవీఆర్ వంటి మల్టిప్లెక్స్‌లకు ఈ మూవీ వల్ల ఒరిగిందేమీ లేదు. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో భూల్ బులయ్యా, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ ఛాప్టర్ 2, డాక్టర్ స్ట్రేంజ్ 2, విక్రమ్ వంటి సినిమాలు విడుదల కావడంతో సినీ థియేటర్ల కళకళలాడాయి. దీంతో రూ. 981 కోట్ల టర్నోవర్ సాధించింది. దీంతో రూ53 కోట్ల లాభం వచ్చింది. కాని జులై నుంచి సెప్టెంబర్ మధ్య ఆదాయం రూ. 686 కోట్లకు పడిపోయింది. మార్చిలోగా రూ. 400 కోట్లతో తాముఉ కొత్తగా 125 స్క్రీన్స్‌ను తీసుకురానున్నట్లు పీవీఆర్ పేర్కొంది.