For Money

Business News

పర్పల్‌ ఫైనాన్స్‌ చేతికి కనోపి ఫైనాన్స్‌

కనోపి ఫైనాన్స్‌ బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీ. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో పర్పల్‌ ఫైనాన్స్‌ కంపెనీతో రివర్స్‌ మెర్జర్‌ అయ్యేందుకు ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని బీఎస్‌ఈకి తెలిపింది. కార్వీ మాజీ సీఈఓ అయిన అమితాబ్ చతుర్వేదీ ఆధ్వర్యంలో ఉన్న పర్పల్‌ ఫైనాన్స్‌ మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా రాష్ట్రాల్లో చిన్న పట్టణాల్లో రూ.4 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలను అందిస్తోంది. కనోపి ఫైనాన్స్‌లో విలీనం చేయడం ద్వారా మార్కెట్‌ నుంచి మరిన్ని నిధులు సమకూర్చుకునే వీలు ఉంటుంది. తమ కంపెనీని వచ్చే నాలుగైదు ఏళ్ళలో డిజిటల్ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌గా మార్చడమే తన లక్ష్యమని అమితాబ్ చతుర్వేది అంటున్నారు.
అప్పర్ సీలింగ్
మార్చి 24వ తేదీ కనోపి షేర్‌ రూ.23.75 వద్ద ట్రేడవుతోంద. అక్కడి నుంచి ప్రతి రోజూ క్షీణిస్తూ మార్చి 31న రూ.18.50కి చేరింది. అక్కడి నుంచి రోజూ అప్పర్‌ సీలింగ్‌తో ఈ షేర్‌ రూ.21.35కు చేరింది. ఇవాళ కూడా నో సెల్లర్స్. 5 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది.