For Money

Business News

తగ్గిన బంగారం ధర!

ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లలో భారీగా పెరిగిన బంగారం ధర ఇపుడు తగ్గుముఖం పట్టింది. ఉదయం ఔన్స్‌ బంగారం 3500 డాలర్లు ఉండగా, అమెరికా మార్కెట్లు ప్రారంభమయ్యే సరికి తగ్గింది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 3400 డాలర్ల ప్రాంతంలో ఉంది. దీంతో రేపు మన మార్కెట్లలోబంగారం ధర తగ్గే ఛాన్స్‌ ఉంది. ఇవాళ ఢిల్లీ మార్కెట్‌లో స్టాండర్డ్‌ బంగారం పది గ్రాముల ధర మరో రూ.2 వేలు పెరిగింది. అనేక మార్కెట్లలో రూ.1,02,000కు చేరింది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (MCX)లో ఉదయం 10 గ్రాముల పసిడి ధర (జూన్‌ కాంట్రాక్ట్‌) రూ. 99,358ని తాకింది. అయితే ఇపుడు రూ. 97,220 వద్ద ట్రేడవుతోంది. అంటే దాదాపు క్రితం ధరకు పడిపోయింది. అయితే కిలో వెండి (మే కాంట్రాక్ట్‌) మాత్రం రూ. 900 పెరిగి రూ. 96,156 వద్ద ట్రేడవుతోంది.