For Money

Business News

నిఫ్టి: ఓపెనింగ్‌లోనే లాభాల స్వీకరణ

ఆల్గో ట్రేడింగ్‌ ఫార్ములా మార్కెట్‌ను నిర్దేశిస్తోంది. ఓపెనింగ్‌లోనే 16,585ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 16,524ని తాకింది. నిఫ్టిని అమ్మినవారికి 60 పాయింట్ల లాభం. ప్రస్తుతం 32 పాయింట్ల లాభంతో 16,528 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. 38 షేర్లు గ్రీన్‌లో ఉన్నా నిఫ్టికి కేవలం నామ మాత్రపు లాభాలు వచ్చాయి. అంటే అన్ని షేర్లు నామ మాత్రపు లాభాలకే పరిమితమయ్యాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 0.2 శాతం పెరగ్గా, బ్యాంక్‌ నిఫ్టి నష్టాల్లోకి చేరుకుంది. మార్కెట్‌ ట్రెండ్‌ చూస్తుంటే మిడ్‌సెషన్‌లోగా నిఫ్టి క్రితం స్థాయికి లేదా నష్టాల్లోకి జారుకునే అవకాశముంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
ఓఎన్‌జీసీ 114.90 2.82
టెక్‌ మహీంద్రా 1,446.20 2.13
టాటా స్టీల్‌ 1,386.60 2.06
హిందాల్కో 414.95 1.99
ఎన్‌టీపీసీ 115.40 1.76
నిఫ్టి టాప్‌ లూజర్స్‌
మారుతీ 6,756.10 -1.02 హెచ్‌డీఎఫ్‌సీ 2,700.10 -0.80
ఏషియన్‌ పెయింట్స్‌ 3,053.05 -0.79
కొటక్‌ బ్యాంక్‌ 1,704.00 -0.75
శ్రీసిమెంట్‌ 25,862.60 -0.47