For Money

Business News

అయోమయంలో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ భవిష్యత్తు

మరో ప్రైవేట్‌ బ్యాంక్ సంక్షోభంలో పడింది. బ్యాంక్‌ సీఈఓ రాజీనామా పెద్ద విషయం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నా… ఆర్‌బీఎల్‌ వ్యవహారం ఇపుడు మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఏదైనా బ్యాంక్‌ 5 శాతం కంటే ఎక్కువ వాటా కొనాలంటే ఆర్బీఐ అనుమతి అవసరం. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌లో పది శాతం వాటా కొంటామని రాకేష్‌ ఝుఝున్‌ వాలా, ఆర్‌కే దమాని ఆర్బీఐకి లేఖ రాశారు. ఆర్‌బీఐ ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ను మరింత పటిష్ఠ పర్చడంతో పాటు బ్యాంక్‌కు గట్టి నాయకత్వం తెచ్చేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో రూ.274 వద్ద ఉన్న ఈ బ్యాంక్‌ షేర్‌ ఇపుడు రూ.173 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఈ బ్యాంక్‌ షేర్‌ను అమ్మాలని సిఫారసు చేస్తోంది. బ్యాంక్‌ రుణాపలై అనిశ్చితి ఉందని ఈ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యాంక్‌ నుంచి వస్తున్న నెగిటివ్ అంశాల కారణంగా ఈ బ్యాంక్‌ షేర్‌ రూ. 130కి పడిపోయే అవకాశముందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. అయితే ఇన్వెస్టెక్‌ అనే బ్రోకింగ్‌ సంస్థ ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేర్‌ను కొనుగోలు చేయమని సలహా ఇస్తోంది. ఈ సంస్థ అంచనా ప్రకారం ఈ షేర్‌ రూ. 295ను చేరే అవకాశముంది. మొత్తానికి ఈ బ్యాంక్‌ వ్యవహారం బ్యాంకింగ్‌ రంగంలో హాట్‌ టాపిక్‌గా మారింది.