ప్రి బడ్జెట్ ర్యాలీకి ఛాన్స్?

ఇవాళ స్టాక్ మార్కెట్ రెండో రోజూ లాభాల్లో ముగిసింది. ఉదయం నుంచి తీవ్ర ఒడుదుడుకులకు లోనైనా.. చివర్లో వచ్చిన మద్దతు కారణంగా సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి మిడ్ సెషన్ తరవాత నష్టాల్లోకి జారుకున్నా… దిగువస్థాయిలో మద్దతు లభించింది. దీంతో నిఫ్టి 37 పాయింట్ల లాభంతో 23,213 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టిలో పెద్దగా మార్పు లేకున్నా.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలలో మంచి లాభాలు కన్పించాయి. ఈ సూచీలు దాదాపు ఒక శాతం దాకా పెరిగాయి. దీన్ని బట్టి చూస్తే బడ్జెట్‌కు ముందు చిన్న పాటి ర్యాలీ వస్తుందా అన్న అనుమానం కల్గుతోంది. ట్రంప్ ఈనెల 20న పదవీ ప్రమాణం చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దగా ఒత్తిడి లేకుంటే… ఈసారి బడ్జెట్ ముందు, ఆ తరవాత మంచి ర్యాలీకి ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ ర్యాలీ ఎంతకాలం ఉంటుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కూడా మన కార్పొరేట్ రంగం నుంచి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు. కాబట్టి… షార్ట్ టర్మ్‌లో ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది.