For Money

Business News

ప్రభుత్వాల అసమర్థత కారణంగా…

సరిగ్గా 4 వారాల క్రితం సెప్టెంబర్‌ 7వ తేదీన ఒక్కో యూనిట్‌ను రూ.3.4లకు కరెంటును కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇపుడు రూ. 20లు చెల్లించాల్సి వస్తోంది. అసమర్థ ప్రభుత్వాల కారణంగా ఇపుడు జనం ఒక్కో యూనిట్‌ కరెంటును ప్రైవేట్‌ కంపెనీల నుంచి రూ. 20చొప్పున కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు వారాల నుంచి వివిధ రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు ఒక్కో యూనిట్‌ను రూ. 14 నుంచి రూ. 16 రేటుకు కొంటున్నాయి. అది జనం సొమ్మే కదా? ముందుస్తు ప్రణాళికలు రచించడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వాలు.. నిన్న పీక్‌ పీరియడ్‌లో ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ (IEX) నుంచి రూ. 19లకు ఒక్కో యూనిట్‌ చొప్పున కొన్నాయి. ఉదయం సమయంలో తక్కువ రేటు ఉండగా, సాయంత్రం ఆరు నుంచి పీక్‌ పీరియడ్‌ ప్రారంభమౌతుంది. నిన్న కనిష్ఠ ధర రూ.14లు కాగా, గరిష్ఠ ధర రూ.19.32 పలికింది. నిన్న మొత్తం జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ళ సగటు ధర చూస్తే యూనిట్‌కు రూ.15.85 చెల్లించారు. ఇవాళ్టి నుంచి అనేక రాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడుతోంది. దీంతో ఇవాళ గరిష్ఠ ధర మరింత పెంచాయి ప్రైవేట్ కంపెనీలు. ఇవాళ ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌లో 430 మెగావాట్ల విద్యుత్‌కు డిమాండ్‌ ఉంది. కాని కంపెనీలు ఆఫర్‌ చేస్తున్న విద్యుత్‌ కేవలం 299 మెగావాట్లు మాత్రమే. దీంతో ఇవాళ పీక్‌ టైమ్‌ రేటు (అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి) రూ. 20 కోట్‌ చేస్తున్నాయి కంపెనీలు. ఇవాళ ఉదయం కూడా యూనిట్‌ రూ.17 చొప్పున అమ్ముతున్నాయి. ఉదయం 8.30 గంటల నుంచి రూ. 13లకు అమ్ముతున్నాయి. కాని ఈ రేట్లు మధ్యాహ్నం 1.35 గంటల వరకే. అంటే ఉష్ణోగ్రతలు పెరిగే సమయానికి కరెంటు రేటు పెరుగుతుందన్నమాట. మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు కరెంటు కొనాలంటే యూనిట్‌కు రూ. 17 చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రం 5.45 నుంచి రేటు రూ. 20లకు పెరిగింది. రాత్రి 11 గంటల వరకు ఇదే రేటుతో కరెంటు కొనాల్సి ఉంటుంది.