యూరప్ దేశాల్లో పవర్ బంద్

యూరప్‌లోని కొన్ని దేశాల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ముఖ్యంగా స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.ఫ్రాన్స్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయిటనట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా స్పెయిన్‌లో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. విద్యుత్ రైళ్ళు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. ఎయిర్ పోర్టులో విమానల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేక హాస్పిటల్స్‌కు విద్యుత్ సమస్య ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణకు ఆరు నుంచి 10 గంటలు పట్టొచ్చని అధికారులు వెల్లడించారు. ఇక పోర్చుగల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. విద్యుత్ సరఫరా మళ్ళీ ఎపుడు ప్రారంభమౌతుందో… కచ్చితంగా చెప్పలేమని అధికారులు అంటున్నారు. అయితే ఈ పవర్ ఔటేజ్‌కు కారణమేమిటో అధికారులు ఇంకా గుర్తించలేదు. సైబర్ అటాక్ కూడా కావొచ్చని అధికారులు అంటున్నారు. తాజా పరిస్థితిని సమీక్షించేందుకు స్పెయిన్, పోర్చుగల్ దేశాలు కేబినెట్‌లు అత్యవసరంగా భేటీ అవుతున్నాయి. ఫ్రాన్స్‌లో కూడా విద్యుత్ అంతరాయం పలు చోట్ల ఉంది. ఇక స్పెయిన్‌లోని మాడ్రిడ్ జరుగుతున్న టెన్నిస్ ఓపెన్ మ్యాచ్‌లు కూడా ఆగిపోయాయి.