వ్యాట్ తగ్గించండి..
ప్రజలకు సాయం చేసేందుకు పెట్రోల్, డీజిల్‌పై తాము విధించే వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ దేశంలో కోవిడ్ పరిస్థితిని ఆయన రాష్ట్ర సీఎంలతో కలిసి సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్రాలు ముందుకు రావాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, కాని కొన్ని రాష్ట్రాలు మాత్రం పన్నులు తగ్గించలేదన్నారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలకు అక్కడి ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నాయని ఆయన అన్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలలో వ్యాట్ తగ్గించని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చిత్రంగా భారీ డిస్కౌంట్‌తో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసిన కేంద్రం…ఆ ప్రయోజనాన్ని మాత్రం ప్రజలకు ఇవ్వడం లేదు.