చైనా కంపెనీలకు PLI

ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ మ్యాన్యూఫ్యాక్చరింగ్ (ECM) కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ రంగంలోని కంపెనీలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్ (PLI) స్కీమ్ కింద చైనా కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రం స్పష్టత ఇచ్చింది. దీంతో చైనాతో భాగస్వామ్యం ఉన్న పలు కంపెనీలు ఇపుడు పీఎల్‌ఐకి దరఖాస్తు చేసుకునే అవకాశముంది. భారత ECM కంపెనీలలో చైనా కంపెనీలకు 49 శాతం వరకు వాటా ఉండేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు పలు కంపెనీలు చైనా కంపెనీలకు వాటాలు ఇచ్చాయి. ఇప్పటికే వరకు PLI స్కీమ్‌కు ఇదే ప్రధాన అడ్డంకిగా ఉంది. ఇపుడు కేంద్రం PLI కోసం చైనాతో భాగస్వామ్యం ఉన్న కంపెనీలు కూడా అర్హత ఉందని చెప్పడంతో డిక్సన్ టెక్నాలజీ, అంబర్ ఎంటర్‌ప్రైజస్, కేన్స్ టెక్నాలజీస్ కంపెనీలకు కలిసి వస్తోంది. పైగా ఈప్యాక్ వంటి కంపెనీలు కూడా దీనివల్ల బాగా లబ్ది కలుగనుంది. ఈసీఎం రంగంలోకి త్వరలో టాటా టెక్ కూడా ప్రవేశించనుంది.