For Money

Business News

చైనాలో తిరుగుబాటు… ?

కొన్ని నిమిషాల నుంచి ట్విటర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ట్రెండింగ్‌లో ఉన్నారు. చైనాలో పీపుల్‌ లిబరేషన్‌ ఆర్మీ తిరుగుబాటు చేసిందని, దేశ అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ను పదవి నుంచి తొలగించి.. గృహ నిర్భంధంలో ఉంచారన్న వార్తలు వైరల్‌ అవుతున్నాయి. మొన్నటి నుంచి చైనా రాజధాని బీజింగ్‌ వైపు పీఎల్‌ఏ ట్యాంకులు కదులుతున్నాయని.. ఈ క్యూ 80 కి.మీ. ఉందని వార్తలు వస్తున్నాయి. ఈనెల 21వ తేదీన చైనాలో 9583 విమాన సర్వీసులు రద్దయినట్లు కూడా సమాచారం. కాని ఇవన్నీ ట్విటర్‌లో వస్తున్న వార్తలు.. చైనాలో ఏదో జరుగుతోందని అనేక వార్తలు సోషల్‌ మీడియాలో హోరెత్తుతున్నాయి. ఈ వదంతులపై అగ్రరాజ్యాలు కూడా ఇంకా స్పందించలేదు.