ఫోన్ పేకు బీమా బ్రోకింగ్ లైసెన్స్
డిజిటల్ పే సంస్థ అయిన ఫోన్ పేకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) నుంచి బీమా బ్రోకింగ్ వ్యాపారం నిర్వహించేందుకు లైసెన్స్ లభించింది. దీంతో ఇన్సూరెన్స్ రంగంలో ఈ కంపెనీ పంపిణీదారుగా మారనుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ఇతర కంపెనీలకు ఏజెంట్‌గా ఇన్సూరెన్స్ పాలసీలను అమ్ముతూ వచ్చింది. ఇక నుంచి స్వయంగా పాలసీలను అమ్మే అవకాశం లభించింది. షేర్ మార్కెట్ బ్రోకింగ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు కూడా ఈ కంపెనీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) అనుమతి కోసం దరఖాస్తు చేసింది.