ఫార్మ్‌ఈజీ.. ఐపీఓకు రెడీ?
దేశంలో అతి పెద్ద ఆన్‌లైన్ ఫార్సీ అయిన ఫార్మ్‌ఈజీ కూడా పబ్లిక్ ఇష్యూకు రావాలని యోచిస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఫార్మ్‌ఈజీ మాతృసంస్థ ఏపీఐ హోల్డింగ్స్ మార్కెట్ నుంచి 100 కోట్ల డాలర్లు అంటే రూ. 7,400 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ కంపెనీలో టీఎంజీ, టెమాసెక్ హోల్డింగ్స్ పీటీఈలకు భారీ వాటా ఉన్న విషయం తెలిసిందే. మెడిసిన్స్ నుంచి డయాగ్నిస్టిక్స్ కిట్స్ వరకు సరఫరా చేసే ఈ కంపెనీ ఇప్పటి వరకు దేశంలో 50 లక్షల కుటుంబాలకు 1.50 కోట్ల ఆర్డర్లను డెలివరీ చేసింది. ఇటీవల ఈ కంపెనీ థైరోకేర్ టెక్నాలజీస్ కంపెనీని రూ. 4,550 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపీఐ హోల్డింగ్స్ వ్యాల్యుయేషన్ 410 కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నారు.