For Money

Business News

ఇన్‌కమ్‌ ట్యాక్స్ తగ్గింపు?

ఆర్థిక వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో కేంద్రం పర్సనల్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి రూ.15 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం బడ్జెట్‌లో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను తగ్గించే అవకాశముందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఆర్థిక వృద్ధి రేటు తగ్గిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. మధ్య తరగతి ప్రజలు ముఖ్యంగా నగరవాసులు అధిక ధరల కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం గుర్తించినట్లు రాయిటర్స్‌ సంస్థ తెలిపింది. 2020లో పలు పన్ను మినహాయింపులకు కోత విధిస్తూ ప్రభుత్వం కొత్త పన్ను విధానం కూడా తీసుకువచ్చింది. అయితే అధిక ద్రవ్యోల్బణం కారణంగా జనం వినియోగవస్తువులపై అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.