For Money

Business News

పేటీఎంను ఇపుడు కొనొచ్చా?

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.928.3 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.290.5 కోట్ల నష్టాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలోఎ కంపెనీ ఆదాయం మాత్రం 34.1శాతం క్షీణించి రూ.1,659.5 కోట్లకు చేరింది. పేటీఎం సినిమాలు, ఈవెంట్ల టిక్కెట్ల బుకింగ్‌ విభాగాన్ని ఇటీవల జొమాటోకు అమ్మేయడం వల్ల కంపెనీకి రూ.1,345 కోట్ల లాభం వచ్చింది. దీంతో ఈ కంపెనీ అధిక లాభాలను ప్రకటించగలిగింది.
ఇపుడే కొనకండి
పొజిషనల్‌ ట్రేడింగ్ కోసం పేటిఎం ఛార్ట్‌ చాలా పటిష్ఠంగా ఉందని, స్వల్ప కాలానికి కాదని జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన అక్షయ్‌ భగవత్‌ తెలిపారు. ఈ షేర్‌కు రూ. 630 వద్ద గట్టి మద్దతు ఉందని ఆయన తెలిపారు. అంటే మరో రూ. 50 నుంచి రూ. 60 పతనానికి ఛాన్స్‌ ఉందన్నమాట. ఈ షేర్‌కు రూ. 625-రూ. 630 వద్ద మద్దతు స్థాయి ఉందని, కాబట్టి దీర్ఘకాలానికి అంటే పొజిషనల్‌ ట్రేడ్‌ కోసమైతే కొనుగోలు చేయొచ్చని అన్నారు. అయితే రూ. 620ని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని ఆయన సూచించారు. అయితే డే ట్రేడింగ్‌ లేదా స్వల్ప కాలానికైతే ట్రెండ్‌ ఇంకా నెగిటివ్‌గా ఉందని అక్షయ్‌ అన్నారు.

Leave a Reply