పేటీఎం పబ్లిక్ ఆఫర్ నవంబర్ 8న
జొమాటొ ఇన్వెస్టర్లు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పబ్లిక్ ఇష్యూ పేటీఎంకు సంబంధించిన కీలక వివరాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. పేటీఎం పబ్లిక్ ఆఫర్ నవంబర్ 8న ప్రారంభమై, 10న ముగుస్తుంది. ఈ ఇష్యూ ధర శ్రేణి రూ. 2,080-రూ. 2,150. ఈ లెక్కల పేటీఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ 2000 కోట్ల డాలర్లు (రూ. 1,50,000 కోట్లు) కానుంది. పబ్లిక్ ఆఫర్ ద్వారా కంపెనీ రూ. 18,300 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 8,300 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా సమీకరిస్తుంది. మిగిలిన మొత్తం అంటే రూ. 10,000 కోట్ల విలువైన షేర్లను ఈ ఆఫర్ ద్వారా ఇపుడున్న ఇన్వెస్టర్లు అమ్ముకుంటారు. తమ షేర్లను అమ్ముతున్న ప్రమోటర్లలో విజయ్ శర్మ (రూ.402 కోట్లు) ఆంట్ ఫిన్(Antfin) కంపెనీ (రూ. 4,704 కోట్లు)
ఆలిబాబా (రూ. 784కోట్లు) ఎలివేషన్ క్యాపిటల్ (రూ.139 కోట్లు) సాఫ్ట్ బ్యాంక్ (రూ.1,689 కోట్లు) బెర్క్‌షైర్ హ్యాత్వే (రూ. 301 కోట్లు) ఉన్నారు.