For Money

Business News

రూ. 12 కోట్లతో బంగ్లా కొన్న పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో 676 గజాల బంగ్లాను రూ. 12 కోట్లకు పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొనుగోలు చేశారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 23వ తేదీన సేల్‌ డేడ్‌ నమోదైంది. రూ. 66 లక్షలు స్టాంప్‌ డ్యూటీ కింద, రూ. 18 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీగా చెల్లించారు. రూ. 6 లక్షలు రిజస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించగా, రూ. 1.2 లక్షల మ్యూటేషన్‌ ఫీజుగా చెల్లించారు. కరోనా సమయంలో జూబ్లిహిల్స్‌ వంటి ఏరియాలలో పెద్ద విస్తీర్ణం గల స్థలాలకు భారీగా డిమాండ్‌ వస్తోంది. గత ఏడాది జూబ్లిహిల్స్ ప్రాంతంలో రూ. 10 కోట్లు దాటిన డీల్స్‌ 17 దాకా జరిగాయి. ఇందులో సినిమా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. 1000 చదరపు అడుగులు మించిన ప్లాట్లకు డిమాండ్‌ అధికంగా ఉందని.. ఒక్కో గజం రూ. 2 లక్షల పలుకుతుందోని బ్రోకర్లు అంటున్నారు. గత ఆగస్టులో సువేన్‌ ఫార్మా అధినేత జాస్తి వెంకటేశ్వరులు రూ. 34.75 కోట్లకు ఓ ఇండిపెండెంట్‌ ఇంటిని అమ్మినట్లు తెలుస్తోంది. అలాగే జూబ్లిహిల్స్‌లో జీవీకే గ్రూప్‌ రూ. 23.15 కోట్లతో 6,033 చదరపు అడుగుల ఇంటిని కొనుగోలు చేసింది. కాని ఖరీదైన డీల్‌ కంట్రోల్‌ఎస్ (CtrlS) కంపెనీ పేరున ఉంది. 2,644 చదరపు గజాల స్థలాన్ని ఈ కంపెనీ రూ. 48 కోట్లకు కొనుగోలు చేసింది.

(source:moneycontrol.com)