For Money

Business News

మూడు రోజులు- రూ. 300 కోట్లు

బాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ కరువు తీరుతోంది. కరోనా తరవాత ఒక్క హిట్‌ కూడా లేకుండా నీరసపడిపోయిన బాలీవుడ్‌కు షారుక్‌ మూవీ పఠాన్‌ ప్రాణం పోసింది. కరోనా తరవాత విడుదలైన ప్రతి హిందీ చిత్రం ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ సాధించలేకపోయాయి. రాణించిన సినిమాలన్నీ దక్షిణాది సినిమాలు లేదా దక్షిణాది సినిమాల రీమేక్‌లే. ఈ నేపథ్యంలో ఈనెల 25న విడుదలైన పఠాన్‌ మూవీ అనూహ్యంగా బాక్సాఫీస్‌ రికార్డులు బద్ధలు కొడుతోంది. మనదేశంలోనే గాక.. విదేశాల్లో కూడా బంపర్‌ కలెక్షన్స్ సాధిస్తోంది. అలాగే హిందీతో పాటు దక్షిణాది భాషాల్లో కూడా ఈ సినిమా చక్కటి కలెక్షన్స్‌ సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే పఠాన్‌ మూవీ రూ. 300 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. తాజా సమాచారం మేరకు దేశీయ మార్కెట్‌లో ఈ సినిమా రూ. 201 కోట్ల కలెక్షన్స్‌ సాధించగా.. విదేశీ మార్కెట్‌లో రూ. 112 కోట్ల కలెక్షన్స్‌ సాధించింది. వెరశి సినిమా కలెక్షన్స్‌ రూ. 313 కోట్లకు చేరాయి. ఇక నాలుగు, అయిదు రోజులు సెలవు రోజులు కావడం, పబ్లిక్‌ మౌత్‌ టాక్‌ బాగుండటంతో ఈ సినిమా తొలి వారాంతంలో రూ. 500 కోట్ల మార్క్‌ దాటుతుందేమో చూడాలి.