For Money

Business News

కేబుల్‌ టీవీ కనెక్షన్‌ రేట్లు 30% జంప్‌

ఫిబ్రవరి 1వ తేదీ నుంచి దేశీయంగా డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ కనెక్షన్‌ చార్జీలు 30 శాతం పెరగనున్నాయి. ఈ మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ను విడుదల చేసింది. కరోనా తరవాత ఓటీటీ మార్కెట్‌ భారీగా విస్తరించిందని.. అలాగే యూట్యూబ్‌ ద్వారా చాలా మంది సినిమాలు చూస్తున్నారని కేబుల్‌ టీవీ ఆపరేట్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో కేబుల్‌ టీవీ కనెక్షన్‌ రేట్లు 30 శాతం పెంచితే వినియోగదారుల సంఖ్య తగ్గుతుందని కేబుల్‌ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు. ట్రాయ్‌ నిర్ణయంతో కేబుల్‌ టీవీ వ్యవస్థ నాశనం అవుతుందని వీరు ఆరోపిస్తున్నారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కేబుల్‌ ఆపరేటర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరి 8వ తేదీన విచారణ జరుగనుంది. అయినా 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌ అమలు చేయాలని ట్రాయ్‌ అంటోంది.