ఫైనాన్స్ కమిషన్ హెడ్‌గా పనగారియా
నీతి ఆయోగ్ మాజీ వైఎస్ ఛైర్మన్ అయిన అరవింద్ పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్నోటిఫికేషన్ విడుదల అయింది. పదవీ స్వీకారం చేసిన రోజు నుంచి 2025 అక్టోబర్ 31వ తేదీ వరకు లేదా కమిషన్ రిపోర్టు సమర్పించే వరకు… కమిషన్ హెడ్‌తో పాటు సభ్యుల పదవీకాలం ఉంటుంది. 2015లో పనగారియాను నీతి ఆయోగ్ తొలి వైఎస్ ఛైర్మన్‌గా నరేంద్ర మోడీ నియమించిన విషయం తెలిసిందే. 16వ ఫైనాన్స్ కమిషన్‌కు సంబంధించిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇది వరకే నోటిఫై చేసింది. అయిదేళ్ళకు సంబంధించిన నివేదికను కమిషన్ సమర్పించాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి కొత్త కమిషన్ సిఫారసులు అమల్లోకి రావాల్సి ఉంటుంది. సిఫారసులు చేసేందుకు కమిషన్‌కు కనీసం రెండేళ్ళు పడుతుంది.