పామాయిల్ దిగుమతులు డబుల్
పండుగల సీజన్, పైగా కేంద్ర దిగుమతి సుంకం తగ్గించింది. వెంటనే దేశీయ కంపెనీలు పామాయిల్ దిగుమతిని పెంచాయి. ఎంతగా పెంచాయంటే…గత ఏడాదితో పోలిస్తే దిగుమతులు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ నెలలో కోటి 40 లక్షల టన్నుల పామాయిల్‌ను భారత కంపెనీలు దిగుమతి చేసుకున్నట్లు రాయిటర్స్ పేర్కొంది. మొత్తం వంటనూనెల దిగుమతులు 72 శాతం పెరిగాయి. తక్కువ సుంకంతో దిగుమతి చేసుకున్నా.. పండుగల సమయంలో కంపెనీలు ధరలు తగ్గిస్తాయా? లేదా అన్నది చూడాలి. దసరా, దీపావళి, క్రిస్మస్, పెళ్ళిళ్ళ సీజన్‌ల కారణంగా ఇక నుంచి వంటనూనెలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. అందుకే క్రూడ్ పామాయిల్ కన్నా.. రీఫైన్ చేసిన పామాయిల్ దిగుమతికి భారత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.