వరి విస్తీర్ణం 24 శాతం డౌన్.. నూనె గింజలు కూడా…
జులై. దేశ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకంగా మారింది. జూన్ నెలలో రుతుపవనాలు దారుణంగా దెబ్బతీశాయి. యూపీ వంటి రాష్ట్రాల్లో వర్షపాత 0.49 శాతం తగ్గింది. భారత వాతారణ శాఖ (ఐఎండీ) ఆరంభంలో హెచ్చరించినట్లు పడినచోట్ల భారీ వర్షాలు.. లేని చోట్ల వర్షాభావం. ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా పంటలు వేయలేదు. చాలా రాష్ట్రాల్లో జూన్‌లో వర్షాలు తగిన స్థాయిలో లేకపోవడం పంట విస్తీర్ణం తగ్గింది. ఖరీఫ్ నాట్ల సీజన్లో వరి విస్తీర్ణం 24 శాతం తగ్గి 72.24 లక్షల హెక్టార్లకి తగ్గింది. ఇక నూనెగింజల పంటల విస్తీర్ణం కూడా 20 శాతం తగ్గి 77.80 లక్షల హెక్టార్లకు పడిపోయింది.
వ్యవసాయ శాఖ అందించిన డేటా ప్రకారం గత ఏడాది 95 లక్షల హెక్టార్లలో వరి పంట వేయగా, 97.56 లక్షల హెక్టార్లలో నూనె గింజల పంటలు వేశారు. 2021-22 జులై- జూన్ సీజన్) ఖరీఫ్ సీజన్లో వరి పంట చాలా కీలకం.సాధారణంగా నాట్లు జూన్‌లోనే పడుతాయి. ఇక వేళ లేటుగా నాట్లు వేసినా జులైలో పూర్తి కావాలి.
జూన్ 1 నుంచి జులై 6 మధ్యకాలంలో వర్షాలు సాధారణ స్థాయిలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది.
వరి అధికంగా పండించే ఈశాన్య, ఈశాన్య ప్రాంతాల్లో ఈసారి వర్షపాతం లోటు 36 శాతం ఉంది. సెంట్రల్ ఇండియా పరవాలేదు. వాణిజ్యపంటలైన చెరకు, పత్తి వంటి పంటలు ఓకే.
కందుల సంగతి
కంది పంట విస్తీర్ణం కూడా ఈసారి బాగా తగ్గింది. గత ఏడాది ఇదే సమయంలో 23.22 హెక్టార్లలో కంది పంట వేయంగా,ఈ ఏడాది ఇప్పటి వరకు 16.58 లక్షల హెక్టార్లలో మాత్రమే శారు. అంటే పంట విస్తీర్ణం 25.58 శాతం తగ్గిందన్నమాట. ఇక మినప్పప్పు పంట విస్తీర్ణం 10.34 శాతం తగ్గింది. ఇక వంటనూనెల విషయానికొస్తే సోయాబీన్ పంట విస్తీర్ణం 21.74 శాతం, వేరుశనగ పంట విస్తీర్ణం 19 శాతం తగ్గింది. జులై 8వ తేదీ వరకు వేసిన పంటల విస్తీర్ణం ఆధారంగా ఈ డేటాను వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఒక మొక్కజొప్న పంట విస్తీర్ణం 24 శాతం తగ్గింది. అయితే సజ్జల పంట విస్తీర్ణం 79 శాతం పెరగడం విశేషం. చెరకు, పత్తి విస్తీర్ణం దాదాపు గత ఏడాది స్థాయిలోనే ఉంది. ప్రధాన పంటలకు జులై నెల చాలా కీలకం. మరి ఈ ఈనెలలో ఏ పంట విస్తీర్ణం ఏ మేరకు పెరుగుతుందో చూడాలి. ఎందుకంటే ఈ ఏడాది వీటి ధరల చాలా కీలకంగా మారనున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. ముగిసినా.. ఉక్రెయిన్‌లో వెంటనే పంటలు వేసే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. కాబట్టి వంటనూనెల ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదు. మరి అత్యంత కీలకమైన వరి పంట విస్తీర్ణంపై కేంద్ర ప్రభుత్వంలో టెన్షన్ నెలకొంది. నిన్నటి దాకా వరి ధాన్యం కొనుగోలు ఆసక్తి చూపని కేంద్ర మంత్రి పియూష్ గోయల్… వరి పంట వేయాల్సిందిగా మొన్న రైతులను విజ్ఞప్తి చేశారు.