మళ్ళీ 5000 డాలర్లపైకి…
గల్ఫ్ యుద్ధం ఆయిల్, బులియన్ మార్కెట్‌ను చాలా అలర్ట్‌గా ఉంచుతోంది. ముఖ్యంగా డాలర్ ఇండెక్స్ 100 దరిదాపుల్లో ఉన్నంత వరకు ఈ రెండు మార్కెట్లలో ఏ చిన్న మార్పు వచ్చిన ధరలు భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ 2 శాతం పెరిగింది. అలాగే బంగారం మళ్ళీ 5000 డాలర్లను దాటింది. ఔన్స్ బంగారం ఇపుడు 5026 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. సిల్వర్, ప్లాటినం కూడా ఇవాళ ఒక శాతంపైగా పెరిగినా… ఇన్వెస్టర్ల దృష్టి అధికంగా బంగారంపైనే ఉంది. భారత మార్కెట్‌లో మాత్రం స్వల్పంగా పెరిగింది. రేపు అమెరికా ఫెడరల్ బ్యాంక్ భేటీ కానుంది. వడ్డీ రేట్లలో మార్పు చేయకపోవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా ఈవారంలో భేటీ అవుతున్నాయి. ఈ సమావేశాల నిర్ణయాల ఎఫెక్ట్ కోసం అనలిస్టులు ఎదురు చూస్తున్నారు.
