For Money

Business News

ఓస్వాల్‌ పంప్స్‌ ఐపీఓ

ప్రైమరీ మార్కెట్‌లో ఇపుడు చాలా బిజీగా ఉంటోంది. లెక్కలేనన్ని కంపెనీలు పబ్లిక్‌ ఆఫర్‌లతో ముందుకు వస్తున్నాయి. వ్యాపార అవసరాల కోసం కొన్ని కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు వస్తుంటే… మెజారిటీ కంపెనీలు మాత్రం ప్రమోటర్లు తమ వాటా అమ్ముకోవడానికి వస్తున్నాయి. అలాంటి కంపెనీనే ఓస్వాల్‌ పంప్స్‌. ఈ కంపెనీ కూడా పబ్లిక్‌ ఇష్యూ కోసం ఇవాళ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 1000 కోట్ల సమీకరించడంతో పాటు ప్రమోటర్లు తమ వాటాలో కొంత భాగం అంటే 1.13 కోట్ల షేర్లను ఈ ఇష్యూ కింద అమ్ముతున్నారు. సోలార్‌ ఆధారిత, గ్రిడ్‌ కనెక్ట్‌ అయిన సబ్‌మెర్సిబుల్‌ పంప్‌లతో పాటు మోనో బ్లాక్‌ పంపులను, ఎలక్ట్రికల్‌ మోటార్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఓస్వాల్‌ బ్రాండ్‌ కింద వీటిని అమ్ముతోంది. పీఎం కుసుమ్‌ పథకం కింద ఇప్పటి వరకు 26,270 టర్న్‌కీ సోలార్‌ పంపింగ్‌ సిస్టమ్స్‌ను కంపెనీ ఏర్పాటు చేసింది. వీటిని రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మహారాష్ట్రాల్లో నెలకొల్పింది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా వచ్చే సొమ్ములో కొంత భాగాన్ని హర్యానాలో కొత్త తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతారు. అలాగే కొంత మొత్తాన్ని రుణాల చెల్లింపు కోసం వాడుతారు.

Leave a Reply