అమూల్ ఆర్గానిక్ ఆటా… త్వరలో పప్పులు
ఇప్పటి వరకు పాలు, పాల ఉత్పత్తులతో పేరొందిన అమూల్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF) ఇవాళ మార్కెట్ ఆర్గానిక్ గోధుమ పిండిన మార్కెట్లో ప్రవేశపెట్టింది. త్వరలో ఆర్గానిక్ పెసర పప్పు, కంది పప్పు, శనగ పప్పుతో పాటు బాస్మితి బియ్యాన్ని మార్కెట్లోకి తేనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి తెలిపారు. తమ ఉత్పత్తుల క్వాలిటీని పరీక్షించేందుకు అయిదు నగరాల్లో క్వాలిటి ల్యాబ్‌లను నెలకొల్పినట్లు ఆయన చెప్పారు. తొలి ల్యాబ్‌ను అహ్మదాబాద్‌లోని అమూల్ ఫెడ్ డైయిరీలో ఏర్పాటు చేశారు. తమ వల్ల పాడి రైతులు ఎలా లబ్ది పొందారో.. అలాగే ఆర్గానిక్ రైతులు లబ్ది పొందనున్నారని ఆయన చెప్పారు. తొలుతు గుజరాత్‌లోని అమూల్ పార్లర్స్తోపాటు ప్రధానరీటైల్ స్టోర్లలో తమ ఆర్గానిక్ గోధమ పిండిని ప్రవేశపెడుతున్నామని అన్నారు. గుజరాత్లో జూన్ మొదటివారంలో ప్రవేశపెడుతున్నారు. ఇదే నెలలో ఢిల్లీ, ముంబై, పుణెలలో సరఫరా చేయనున్నారు. హోం డెలివరీ కోసం ఆన్లైన్ ఆర్డర్లను కూడా స్వీకరించనున్నారు. ఆర్గానిక్ గోధుమ పిండిని కిలో రూ. 60 చొప్పున, అయిదు కిలోల ప్యాక్‌ను రూ. 290లకు అందిస్తున్నట్లు సోధి తెలిపారు.