మీ పేరుతో 9 సీమ్ కార్డులు ఉన్నాయా?
దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే, వెంటనే మళ్లీ ధ్రువీకరణ (రీ వెరిఫికేషన్) చేయాలని… టెలికాం కంపెనీలకు టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ గనుక ధ్రువీకరణ జరగని పక్షంలో ఆ మొబైల్ కనెక్షన్ను తొలగించాలని స్పష్టం చేసింది. దొలగించే పక్షంలో వినియోగదారులు కోరుకున్న సిమ్ కార్డులు కాకుండా… మిగిలిన కనెక్షన్లకు తొలగించాలని డాట్ ఆదేశించింది. ఆర్థిక నేరాలు, అనవసర కాల్స్, నేరపూరిత కార్యకలాపాల నిరోధానికి డాట్ తాజా ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ ధ్రువీకరణ చేయించుకోని అదనపు మొబైల్ కనెక్షన్లు డిసెంబరు 7 నుంచి 60 రోజుల్లోగా రద్దవుతాయి. ఒకవేళ చందాదారు విదేశీ పర్యటనల్లో/ఆసుపత్రిలో ఉంటే మరో 30 రోజులు అదనపు సమయం ఇస్తారు.