ఓపీజీ సెక్యూరిటీస్ ఎండీ అరెస్ట్
ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ కేసులో ఓపీజీ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తాను సీబీఐ అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఎన్‌ఎస్‌ఈ కో లొకేషన్ స్కామ్‌లో లబ్ది పొందిన బ్రోకింగ్ సంస్థల్లో ఎపీజీ సెక్యూరిటీస్ ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఈ బ్రోకింగ్ సంస్థ ఈ కుంభకోణంలోకీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ అధినేత సంజయ్ గుప్తా భారీ ఎత్తున విదేశీ లావాదేవీలు, హవాలా లావాదేవీలు జరిపారని కాని ఖాతాల్లో చూపలేదని సీబీఐ భావిస్తోంది. కోట్ల రూపాయల ఆస్తుల కుంభకోణంలో నగదును కూడా చెల్లించినట్లు సీబీఐ అనుమానం. రిచర్ బిజినెస్ సర్వీసెస్ ద్వారా సంజయ్ గుప్తా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, ట్రేడింగ్ వ్యాపారాలు చేసినట్లు ఐటీ విభాగం కూడా గుర్తించింది.