ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ నిషేధం
ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన ప్రకటనలను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలకు కేంద్ర సమచార, ప్రసారాల శాఖ ఆదేశించింది. టీవీ, ప్రింట్‌తో పాటు డిజిటల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలు వేయరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్‌ను దేశంలో నిషేధించామని, దీనివల్ల జనం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురౌతున్నారని కేంద్రం తెలిపింది. అలాగే ఆన్లైన్ గేమింగ్స్ ఆడేవారి వల్ల సామాజిక, ఆర్థిక రిస్క్‌లను కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొంది.