For Money

Business News

పబ్లిక్‌ ఇష్యూకు రానున్న ఓలా!

ఐపీఓ బాట పడుతున్న కంపెనీల్లో ఓలా కూడా చేరింది. మార్కెట్‌ నుంచి వంద కోట్ల డాలర్ల అంటే రూ. 7,400 కోట్లు సమీకరించేందుకు ఓలా పబ్లిక్‌ ఇష్యూ జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. పబ్లిక్‌ ఆఫర్‌ మేనేజ్‌ చేసేందుకు సిటీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, మోర్గాన్‌ స్టాన్లీ సేవలను ఓలా తీసుకుంటున్నట్లు సమాచారం. ఓలాలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంక్‌ భారీ పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే. జొమాటో పబ్లిక్‌ ఆఫర్ విజయవంతం కావడంతో పేటీఎం, ఫార్మ్‌ ఈజీ, పాలసీ బజార్‌ కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకు సిద్ధమౌతున్నాయి. ఒలా ఇపుడు ఆస్ట్రేలియా, బ్రిటన్‌లలో కూడా సేవలు అందిస్తోంది. గత జులైలో టెమాసెక్‌, వార్‌బర్గ్‌ పింకస్‌లు దాదాపు 50 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టాయి.