For Money

Business News

నేటి నుంచి ఓలా EV బుకింగ్‌ …

ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ డేకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్‌ 8వ తేదీ నుంచి ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రొ వాహనాలను అమ్ముతున్నట్లు కంపెనీ పేర్కొంది. పది రంగుల్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఓలా ఎస్‌ 1 ధర రూ. 99,999 నుంచి రూ. 1,29,999 మధ్య ఉంటుందని కంపెనీ వెల్లడించింది. మొత్తం ఆన్‌లైన్‌లోనే కొనుగోలు ప్రక్రియ సాగుతుందని, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపదికన అమ్మకాలు ఉంటాయని, స్టాక్‌ ఉన్నంత వరకే అమ్మకాలని కూడా కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకటించే ధరల్లో సబ్సిడీ కలిపి లేదని, బండి కొనుగోలు చేసిన తరవాత ఆయా ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీని వినియోగదారులు క్లయిమ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.