For Money

Business News

ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓ రెడీ

ఎలక్ట్రిక్‌ స్కూటర్లను తయారు చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించేందుకు రెడీ అయింది. కంపెనీ ప్రాస్పెక్టస్‌కు సెబీ ఆమోదం తెలిపింది.దీంతో కేవలం నెల వ్యవధిలోనే ఓలా ఐపీఓ మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గడచిన 20 ఏళ్ళలో పబ్లిక్‌ ఇష్యూ చేయనున్న తొలి ఆటో కంపెనీగా ఓలా రికార్డు సృష్టించనుంది. గత డిసెంబర్‌లోకంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు సంబంధించిన ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 6వ తేదీ నాటికి ఈ కంపెనీ 100 కోట్ల డాలర్లను ఇన్వెస్టర్ల నుంచి సమీకరించింది. కంపెనీ వ్యాల్యూయేషన్‌ 4900 కోట్ల డాలర్లుగా లెక్కిస్తున్నారు. మార్కెట్‌ నుంచి రూ. 5500 కోట్లు సమీకరించేందుకు సెబీ నుంచి ఓలా అనుమతి కోరింది.  ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లలో 9.51 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఆఫర్‌ కింద అమ్మనున్నారు.