For Money

Business News

సర్వే: కమల, ట్రంప్‌ మధ్య టై

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. వచ్చే నెలలో జరుగనున్న ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లిక్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య పోరు హోరా హోరీగా సాగుతోందని న్యాయర్క్‌ టైమ్స్‌/సియనా కాలేజీ నిర్వహించిన సర్వే పేర్కొంది. ఈ సర్వే వివరాలను ఇవాళ ప్రకటించారు. కమలా, ట్రంప్‌ మధ్య సర్వే ఫలితాలు సమానంగా వచ్చాయి. అయితే ట్రంప్‌కు ఒక పర్సంటేజ్‌ పాయింట్‌ అధికంగా వచ్చినట్లు ద న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. మార్జిన్‌ ఆఫ్‌ ఎర్రర్స్ మూడు శాతంగా పేర్కొంది. గత జులైలో నిర్వహించిన ఈ సర్వేలో కూడా ఫలితాలు ఇలానే వచ్చాయి. దీంతో ఈ మంగళవారం కమల, ట్రంప్‌ మధ్య జరిగే డిబేట్‌ చాలా కీలకం కానుంది. ట్రంప్‌కు సంబంధించి రిపబ్లికన్‌ ఓటర్లలో పూర్తి క్లారిటీ ఉందని, ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనుకునేవారి సంఖ్య చాలా తక్కువని సర్వే పేర్కొంది. అయితే కమలా గురించి తాము ఇంకా తెలుసుకోవాల్సి ఉందని చెప్పిన డెమొక్రటిక్‌ ఓటర్లలో 28 శాతం మంది ఉన్నారని సర్వే పేర్కొంది. టీవీ డిబేట్ల కంటే స్థానిక ర్యాలీలు, ప్రచారాల్లో కమలా హారిస్‌ చురుగ్గా పాల్గొంటున్నారని… దీంతో వచ్చే మంగళవారం జరిగే ప్రెసిడెన్షియల్‌ అడ్రస్‌ ఆమెకు చాలా కీలకంగా కానుందని న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. మార్జిన్‌లలో ఏమాత్రం తేడా వచ్చినా… ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముందని తెలిపింది.

Leave a Reply