లిస్టింగ్ రోజే 85 శాతం లాభం
సెలవు రోజులు పక్కన బెడితే కేవలం వారం రోజుల్లో 85 శాతంపైగా లాభం ఇచ్చింది నైకా ఐపీఓ. రూ. 1125 ధరతో షేర్లను నైకా అలాట్ చేసింది. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌రూ. 2095 వద్ద ట్రేడవుతోంది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష కోట్లను దాటింది. అక్టోబర్ 28న ప్రారంభమైన నైకా పబ్లిక్ ఆఫర్ నవంబర్ 1న ముగిసింది. వాస్తవానికి పబ్లిక్ ఇష్యూ రేపు లిస్ట్ కావాల్సింది. అలాట్ ప్రక్రియ, రీఫెండ్ తొందరగా పూర్తి ఇవాళే షేర్లను లిస్ట్ చేసింది. మార్కెట్ నష్టాలతో ట్రేడవుతున్న రోజున ఈ షేర్ ఆకర్షణీయ లాభాలతో లిస్ట్ అయింది.