చరిత్ర సృష్టించిన ఎన్విడియా

ఏఐ బూమ్ కారణంగా ఎన్విడియో కంపెనీ షేర్ పరుగులు పెడుతోంది. హై ఎండ్ సెమి కండక్టర్లను తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఈ స్థాయి మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించిన తొలి కంపెనీగా ఎన్విడియా చరిత్ర సృష్టించింది. ఇవాళ కూడా ఈ షేర్ 3శాతం దాకా పెరిగి 164 డాలర్లను దాటింది. 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించేందుకు ఈ షేర్ ధర 163.93 డాలర్లకు చేరాల్సింది. ఇవాళ 164.42 డాలర్ల గరిష్ఠ స్థాయిని తాకి ఇపుడు 163.26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.