నువొకొ విస్తాస్: ఐపీఓ ఇన్వెస్టర్లకు షాక్
సిమెంట్ షేర్లకు మంచి డిమాండ్ ఉండటంతో నిర్మా గ్రూప్ కంపెనీ అయిన నువొకొ విస్తాస్ కార్పొరేషన్ షేర్లకు ఒక మోస్తరుగా ఇన్వెస్టర్లు సబ్‌స్క్రయిబ్ చేశారు. ఆగస్టు 9న ముగిసిన ఈ ఐపీఓ 1.71 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. ఇవాళ కంపెనీ షేర్లు స్టాక్‌ఎక్స్ఛేంజీలో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 570 కాగా, షేర్ రూ. 485 వద్ద లిస్టయింది. అంటే 15 శాతం నష్టంతో లిస్టయిందన్నమాట. వాస్తవానికి ఈ ఇష్యూ ఆఫర్ ధర అధికంగా ఉందని రీటైల్ ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రీటైల్ ఇన్వెస్టర్లకు ఆఫర్ చేసిన షేర్లలో కేవలం 73శాతం షేర్లు మాత్రమే సబ్‌స్క్రయిబ్ చేశారు. వారికి ఇవాళ పెద్ద షాకే. అయితే రూ. 485 నుంచి కోలుకుని ఇపుడు షేర్ రూ. 536 వద్ద ట్రేడవుతోంది. ఈ లెక్కన చూసినా… షేర్ ఆరు శాతం డిస్కౌంట్‌తో ట్రేడవుతున్నట్లు లెక్క.