For Money

Business News

నిర్మా కంపెనీకి ఇన్వెస్టర్ల షాక్‌

కొత్త పబ్లిక్‌ ఆఫర్ల జోరుకు ఒక్కసారిగా బ్రేక్‌ పడింది. నిర్మా వంటి పెద్ద గ్రూప్‌ నుంచి వచ్చిన పబ్లిక్‌ ఆఫర్‌కు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి స్పందన అంతంత మాత్రమే ఉంది. నిర్మా గ్రూప్‌లోని సిమెంట్‌ డివిజన్‌ కంపెనీ నువొకొ విస్తాస్‌ కార్పొరేషన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ఈ ఇష్యూ 1.71 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రియిబ్‌ అయినట్లు తెలుస్తోంది. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (QIBs) కు ఆఫర్‌ చేసిన వాటా 4.23 శాతం ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయితే నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన షేర్లలో 66 శాతం షేర్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ఇక రీటైల్‌ ఇన్వెస్టర్ల కోటాలో ఆఫర్‌ చేసిన షేర్లకు కూడా కేవలం 73 శాతం షేర్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. అంటే దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లందరికీ షేర్లు అలాట్‌మెంట్‌ ఖాయమన్నమాట. ఈ కంపెనీ షేర్లను రూ. 560-రూ. 570 శ్రేణిలో ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే.