ఇపుడు ప్రయాణం… చెల్లింపు తరవాత
ఈ ప్లాట్‌ఫామ్‌లలో అనేక వస్తువులు మనం కొంటున్న సమయంలో… చెల్లించాల్సిన మొత్తాన్ని వాయిదా పద్ధతిలో చెల్లిస్తుంటాం. అలాంటి సదుపాయాన్ని భారత రైల్వే విభాగం తన ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. దీంతో రిజర్వేషన్, తత్కాల్ పద్ధతిలో టికెట్లు కొనే ప్రయాణీకులు.. టికెట్ చార్జీలను తరవాత వాయిదాలలో చెల్లించవచ్చు. దీని కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), క్యాషే (CASHe) మధ్య ఒప్పందం కుదిరింది. రైల్వే టికెట్లను ఐఆర్సీటీసీ అమ్ముతున్న విషయం తెలిసిందే. ఐఆర్సీటీసీ ట్రావెల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం పొందొచ్చు. చెకౌట్ వద్ద ఈ ఆప్షన్‌ను ఎంచుకుని టికెట్ చార్జీ మొత్తాన్ని ఆరు నుంచి 8 నెలల్లో ఈఎంఐ ( Equated Monthly Instalments -EMI) పద్ధతిలో చెల్లించవచ్చు. అర్హులైన ప్రయాణీకులందరూ ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా ఈ ఆప్షన్‌ను పొందవచ్చు.