For Money

Business News

వైజాగ్‌లో బజాజ్‌ చేతక్‌ EV

బజాజ్‌ కంపెనీ తయారు చేస్తున్న బజాజ్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ కేవలం ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే లభిస్తోంది. పుణె, బెంగలూరు, నాగ్‌పూర్‌, మైసూర్‌, మంగళూరు, ఔరంగాబాద్‌లలో లభిస్తోంది. తరవాత హైదరాబాద్‌ కూడా చేరింది. తాజాగా ఇపుడు వైజాగ్‌లో కూడా తమ చేతక్‌ను బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇంకా కోయంబత్తూర్, మదురై, కొచ్చి, కోజికోడ్, హుబ్లీ, నాసిక్, వసాయ్, సూరత్, ఢిల్లీ, ముంబైలో కూడా బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. డెలివరీకి 4-8 వారాల సమయం పడుతోందని సంస్థ వెల్లడించింది.బజాజ్ ఆటో తన ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.300 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొంది. చేతక్‌ ధర హైదరాబాద్‌లో రూ. 1,44,175.