జూడియో సృష్టికర్త… నోయెల్
ఇటీవలి కాలంలో టాటా గ్రూప్‌లో బాగా రాణిస్తున్న షేర్… ట్రెంట్. గత కొన్ని రోజుల నుంచి భారీ లాభాల్లో కొనసాగుతున్న ఈ షేర్ ఇవాళ కూడా నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ముందుంది. మార్కెట్ నష్టాల్లో ఉన్నా… ట్రెంట్ ఇవాళ రెండున్నర శాతంపైగా లాభంతో రూ. 8,231 వద్ద ముగిసింది. జెట్ స్పీడుతో రూ. 10,000 మార్క్‌ను దాటుతుందని టెక్నికల్ నిపుణులు చెబుతున్నారు. పదేళ్ళ క్రితం వరకు ట్రెంట్ అంటే వెస్ట్‌సైడ్. కేవలం ధనికులకు. టాప్ క్లాస్ వర్గాలకు కేరాఫ్ అయిన స్టోర్. అయితే నోయెల్ టాటా 2016లో జుడియోను తీసుకువచ్చారు. అతి తక్కువ ధరలో అత్యాధిక డిజైన్స్‌తో వచ్చిన ఈ బ్రాండ్ చాలా తక్కువ కాలంలో బ్రహ్మాండమైన క్రేజ్‌ను సంపాదించకుంది. ఒకే కాంప్లాక్స్‌లో టాటా కంపెనీలైన స్టార్, వెస్ట్‌సైడ్, తనిష్క్ ఉన్నా… జుడియోకే రష్ ఎక్కువగా ఉంటుంది. వెస్ట్‌సైడ్ గతంలో కేవలం నగరాలకే పరిమితం కాగా… ఇపుడు జుడియో 164 నగరాల్లో 545 స్టోర్స్‌తో రాణిస్తోంది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా ఇవాళ నియమితులైన నోయల్ టాటా ఇప్పటికే సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా నిరూపితమయ్యారు. రతన్ టాటాకు వరసకు సోదరుడు నోయల్ టాటా. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ కుమారుడే నోయెల్. ట్రెంట్‌తో పాటు వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు నోయల్ ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్, టైటాన్‌కు వైస్ ఛైర్మన్‌గానూ ఉన్నారు. అలాగే శ్రీ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులోనూ నోయల్ సభ్యుడిగా ఉన్నారు.
టాటా గ్రూప్ కంపెనీలన్నింఇకి హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్. ఈ సంస్థలో టాటా ట్రస్ట్స్‌కే 66% వాటా ఉంది. ఇప్పటివరకు టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా రతన్ టాటా ఉన్నారు. ఇపుడు ఆ బాధ్యతలను నోయల్ టాటాకు అప్పగించారు.