పిల్లలకు కోవాగ్జిన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
భారత్ బయోటెక్ పిల్లల కోసం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (SEC) ఆమోదం తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో 2 నుంచి 18 ఏళ్ళలోపు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఈ ఏడాది మేలో ప్రారంభమైన ఈ టీకా ప్రయోగాలు సెప్టెంబర్‌లో పూర్తయ్యాయి. పెద్దల కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ప్రయోగదశలో ఎలాంటి ఫలితాలు చూపిందో… అదే ఫలితాలు పిల్లలపై జరిపిన అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఇతర టీకాలకు భిన్నంగా ఈ వ్యాక్సిన్ సూదీతో పాటు వస్తుంది. దీనివల్ల ఎంత వ్యాక్సిన్ ఇవ్వాలో అంతే ఇచ్చినట్లు అవుతుంది.