For Money

Business News

NIFTY TRADE: అప్పటి వరకు నో షార్టింగ్‌

విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద అమ్మకాలు చేయడం లేదు. అలాగే కొనుగోళ్ళు కూడా చేయడం లేదు. బహుశా ఫలితాల తరవాత తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఎఫ్‌ అండ్‌ ఓలో మాత్రం యాక్టివ్‌గా ఉన్నారు. నిఫ్టి 20 రోజులు సగటు 17400. ఇప్పటికే 17900, 18000 వద్ద కాల్ రైటింగ్‌ జరుగుతోంది. 17600 వద్ద పుట్‌ రైటింగ్‌ సాగుతోంది. 17800 లేదా 18000 మించి దాటే పరిస్థితి లేదు. దిగువ స్థాయిపై ఎలాంటి సంకేతాలు లేవు. అయినా 17670లోపు నిఫ్టి వెళ్ళేంత వరకు నిఫ్టిని షార్ట్‌ చేయొద్దని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ అంటున్నారు. బేస్‌ 17732 లేదా 17670గా ఆయన పేర్కొంటున్నారు. పెరిగితే 17843 లేదా 17891 వద్ద అమ్మకాల ఒత్తిడి వస్తుందని అంటున్నారు. ఇతర లెవల్స్‌ను వీడియోలో చూడగలరు.