కరెన్సీగా బిట్‌కాయిన్ ప్రతిపాదన లేదు
దేశంలో బిట్‌కాయిన్‌ను ఒక కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు స్పష్టం చేశారు. బిట్‌కాయిన్ లావాదేవీల డేటాను కేంద్రం సమీకరించడం లేదనీ తెలిపారు.క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫిసియల్ డిజిటల్ కరెన్సీ బిల్ 2021ను కేంద్రం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఓ సభ్యుడు ఈ ప్రశ్న అడిగాడు. మరోవైపపు అధికారిక క్రిప్టో కరెన్సీని కేంద్రం ప్రకటించింది. దీనికి వీలుగా డిజిటల్ కరెన్సీని ఆవిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ)ని తీసుకురావడం కోసం ఆర్బీఐ చట్టం-1934లో సవరణ నిమిత్తం గత నెలలో ఆర్బీఐ నుంచి ప్రతిపాదన అందిందని లోక్‌సభకు ఆర్థిక శాఖ రాతపూర్వకంగా తెలిపింది.