అవి వదంతులు మాత్రమే

యూపీఐ లావాదేవీలపై చార్జీలు విధిస్తారంటూ వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. యూపీఐ లావాదేవీలపైనా మర్చంట్ ఛార్జీలను ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఇవాళ ఉదయం నుంచి జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కేంద్రం స్పందించింది. అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా రూ.3,000కు మించిన లావాదేవీలపై మర్చంట్ ఛార్జీలను విధించే యోచనలో కేంద్రం ఉందని వార్తలు వచ్చాయి. బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, ఎన్‌పీసీఐ వంటి సంబంధిత సంస్థలతో చర్చించిన తరవాత వీటిపై నిర్ణయం తీసుకుంటారని కూడా జాతీయ మీడియా రాసింది. అయితే వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.