ఖాళీగా వచ్చిన స్పైస్‌జెట్ విమానం
ఇవాళ దుబాయ్ నుంచి స్పైస్‌జెట్ విమానం ప్యాసింజర్లు లేకుండా ఖాళీగా వచ్చింది. ఇటీవల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఈ విమాన కంపెనీ దుబాయ్ ఎయిర్‌పోర్టు అధికారులకు బకాయిలను చెల్లించలేకపోయింది. దీంతో విమానంలోకి ప్యాసింజర్లను ఎయిర్ పోర్టు అధికారులు అనుమతించ లేదు. దీంతో విమానం ఖాళీగా భారత్‌కు బయలుదేరింది. మరోవైపు స్పైస్‌జెట్ ఆర్థిక, సాంకేతిక సామర్థ్యంపై అనుమానాలు రావడంతో ఈ కంపెనీపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిఘాను మరింత పెంచింది. ఎప్పటికపుడు విమానం సాంకేతిక అంశాలను పరిశీలిస్తోంది. అలాగే ఖాతాల ఆడిట్‌ను చేస్తోంది. కంపెనీపై పెంచిన నిఘా నిబంధనలను తక్షణం అమల్లోకి వచ్చినట్లు డీజీసీఏ వెల్లడించింది.