ఐటీ వొద్దు… బ్యాంకులు ముద్దు
ఐటీ షేర్లలో ఇంకా పతనం ఉంటుందని… ప్రస్తుత స్థాయలో తాను ఏ షేర్‌ను కూడా సిఫారసు చేయనని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… బ్యాంకు షేర్లు పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని.. అందులో ఐసీఐసీఐ బ్యాంక్‌కు మంచి ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయిలోనూ ఐటీ షేర్లు ఆకర్షణీయం కాదన్నారు. ఇక నిఫ్టి గురించి ఆయన మాట్లాడుతూ… పెద్దగా పెరిగే ఛాన్స్ లేదన్నారు. మార్కెట్ పది గంటల వరకు వెయిట్ చేసి ట్రేడింగ్ పొజిషన్ తీసుకోవాలని సలహా ఇచ్చారు. నిఫ్టిని కొనేవారు 16050ని స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని ఆయన అన్నారు. డిక్షన్ టెక్నాలజీ షేర్ ఇవాళ పెరిగే అవకాశముందని ఆయన అన్నారు.