For Money

Business News

టర్మ్‌ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగింపు..?

ఇన్సూరెన్స్‌ పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ నెల 7వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగనుంది.ఈ సమావేశంలో ప్రధానంగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై చర్చ జరగనుంది. అయితే ఇన్సూరెన్స్‌ కంపెనీల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం, కొందరు కేంద్ర మంత్రులు కూడా టర్మ్‌ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరడంతో…. వచ్చే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై మాత్రం జీఎస్టీ యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అనేది పూర్తిస్థాయి బీమా రక్షణ అందిస్తుండగా, ఇతర పాలసీలు ఇన్సూరెన్స్‌తో పాటు ప్రతిఫలాన్ని అందిస్తాయి. దీంతో వీటిపై మినహాయింపు ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. టర్మ్‌ పాలసీలపై జీఎస్టీ మినహయింపు వల్ల సుమారు రూ.200 కోట్ల మేర ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని అంచనా.