For Money

Business News

ఎల్‌ఐసీ ఐపీఓలో చైనా పెట్టుబడులకు నో?

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమైతోంది. ఈ ఏడాది చివర్లో పబ్లిక్‌ ఆఫర్‌ చేయనున్నాయి. ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో చైనా పెట్టుబడులను నిషేధించాలని కేంద్రం యోచిస్తోంది. రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా లేనందున… చైనా ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో పెట్టుబడులు పెట్టకుండా ప్రభుత్వం నిషేధం విధించే అవకాశముందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఏ విధంగా నిషేధిస్తారనే అంశంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని రాయిటర్స్‌ వార్త సంస్థ అంటోంది. మరోవైపు ఈ పబ్లిక్‌ ఆఫర్‌లో 20 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.